ప్రియదర్శి (Priyadarshi) ఈ మధ్యనే ‘కోర్ట్’ తో (Court) ఓ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా ఏకంగా రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. మేకర్స్ ఆశించిన దానికంటే పది రెట్లు, ఆ సినిమా కలెక్ట్ చేసింది. దీంతో ప్రియదర్శి నెక్స్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ కూడా ఇంప్రెస్ చేశాయి. కామెడీ సినిమాలకి మంచి డిమాండ్ ఉన్న ఈరోజుల్లో ప్రియదర్శి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) వంటి మినిమమ్ గ్యారంటీ అనే కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది.
ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా నవ్వుకున్నాం అని చెప్పారు. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం బిలో యావరేజ్ గానే అనిపించాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.18 cr |
సీడెడ్ | 0.05 cr |
ఆంధ్ర | 0.15 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.38 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.10 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.48 cr |
‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) సినిమాకు రూ.6.6 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.48 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.76 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.