Alappuzha Gymkhana Collections: ‘జింఖానా’ ..అస్సలు ఊహించని ఓపెనింగ్స్!
- April 28, 2025 / 05:21 PM ISTByPhani Kumar
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ (Premalu) తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు నస్లేన్(Naslen). ఆ సినిమాలో ఇతని కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ‘అలప్పుజ జింఖానా’(Alappuzha Gymkhana ) అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తెలుగులో కొంచెం ఆలస్యంగా అంటే ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ కూడా మంచి టాక్ రాబట్టుకుంది.
Alappuzha Gymkhana Collections:

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. మొదటి రోజు ఓకే అనిపించిన ఈ సినిమా బుకింగ్స్ రెండో రోజు,మూడో రోజు మరింతగా పెరిగాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.57 cr |
| సీడెడ్ | 0.17 cr |
| ఆంధ్ర | 0.39 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.13 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) | 0.12 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 1.25 cr |
‘జింఖానా’ (తెలుగు వెర్షన్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు. 3 రోజుల్లో ఈ సినిమా రూ.1.25 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.39 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.25 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. అయితే వీక్ డేస్ లో ఎలా నిలబడుతుందో చూడాలి.











