‘ప్రేమలు’ (Premalu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నస్లేన్ (Naslen). ఆ సినిమాలో తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana ) అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తెలుగులో కొంచెం ఆలస్యంగా అంటే ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ కూడా మంచి టాక్ రాబట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది.
మొదటి రోజు ఓకే అనిపించిన ఈ సినిమా బుకింగ్స్ రెండో రోజు కూడా బెటర్ అనిపించాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.32 cr |
సీడెడ్ | 0.11 cr |
ఆంధ్ర | 0.29 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.72 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) | 0.08 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.80 cr |
‘జింఖానా’ (తెలుగు వెర్షన్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.80 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.25 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.7 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం రోజు కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. వీక్ డేస్లో కూడా ఇలాగే కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువే ఉంటాయి.