ప్రియదర్శి (Priyadarshi) నుండి ‘కోర్ట్’ (Court) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ‘సారంగపాణి జాతకం'(Sarangapani Jathakam) . ఏప్రిల్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కామెడీ బాగుందని.. ముఖ్యంగా సెకండాఫ్ బాగా వర్కౌట్ అయ్యిందని, దర్శకుడు ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.
మొదటి రోజు కంటే రెండో రోజు పికప్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఆల్మోస్ట్ మొదటి రోజులాగే కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.33 cr |
సీడెడ్ | 0.10 cr |
ఆంధ్ర | 0.29 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.72 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.18 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.90 cr |
‘సారంగపాణి జాతకం’ సినిమాకు రూ.6.6 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.90 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.4 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.