ఎట్టకేలకు 150 కోట్ల షేర్ మార్క్ ను కూడా దాటేసాడు అల్లు అర్జున్. ప్రభాస్ తర్వాత ఈ ఫీట్ అందుకోబోతున్న హీరో అల్లు అర్జున్ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకూ టాలీవుడ్ స్టార్ హీరోలందరికన్నా చివరి ప్లేస్ లో ఉన్న అల్లు అర్జున్.. ఈ రేర్ ఫీట్ సాధిస్తాడు అని ఎవ్వరూ అంచనా వేసి ఉండరు. ‘నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా’ వంటి డిజాస్టర్ పడింది అనుకునే లోపే.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అవును ఇప్పటికీ ‘అల వైకుంఠపురములో’ చిత్రం కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి.
ఇక ఈ చిత్రం 19 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
41.12 cr
సీడెడ్
17.50 cr
ఉత్తరాంధ్ర
18.72 cr
ఈస్ట్
10.81 cr
వెస్ట్
8.51 cr
కృష్ణా
10.19 cr
గుంటూరు
10.61 cr
నెల్లూరు
4.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
11.54 cr
ఓవర్సీస్
17.96 cr
వరల్డ్ వైడ్ టోటల్
151.33 cr (share)
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 19 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…121.83 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..151.33 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 241.70 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రానికి మరో వీకెండ్ కూడా ఉంది కాబట్టి అది సాధ్యమవుతుందనే చెప్పొచ్చు.