Alekhya Reddy: కూతురు పుట్టినరోజు సందర్భంగా అలేఖ్య ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తారకరత్న మృతి చెందడం అభిమానులను ఎంతగానో బాధ పెట్టిందనే సంగతి తెలిసిందే. అందరి మంచి కోరే మంచి హీరోగా పేరు సంపాదించుకున్న తారకరత్న మరణం అభిమానులను సైతం ఎంతగానో బాధ పెట్టింది. నిష్క పుట్టినరోజు సందర్భంగా అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అలేఖ్య తన పోస్ట్ లో కూతురు నిష్కను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిమిషం నుంచి మాకెంతో గర్వంగా ఉందని అలేఖ్య వెల్లడించారు. నీ నవ్వు, ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. నిష్కకు అలేఖ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి మీకు మద్దతు ఇవ్వడానికి మీ అమ్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందంటూ అలేఖ్య ఎమోషనల్ కావడం గమనార్హం.

అలేఖ్య చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు సైతం నిష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిష్క కెరీర్ పరంగా సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. నిష్కకు ఏ రంగంలో ఆసక్తి ఉందో అదే రంగంలో ప్రోత్సహించాలని అలేఖ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలేఖ్య కుటుంబానికి బాలయ్య సైతం తన వంతు సహాయసహకారాలను అందిస్తున్నారు.

నిష్కకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలియాల్సి ఉంది. అలేఖ్య మాత్రం మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటున్నారు. పిల్లల చదువు విషయంలో కూడా అలేఖ్య ఎంతో కేర్ తీసుకుంటున్నారు. అలేఖ్య కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఆమెకు దేవుడి ఆశీర్వాదాలు కూడా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నందమూరి అభిమానులు అలేఖ్యను ఎంతగానో అభిమానిస్తున్నారు. అటు అలేఖ్య ఇటు నిష్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతూ ఉండటం గమనార్హం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus