అలీ ఫ్యామిలీకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన చిరు.!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులు ఆరాధించే అభిమాన హీరోల్లో ఒకరు..చిరంజీవిని అభిమానించే వారిలో ప్రేక్షకులతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా అభిమానించే హీరోలు ఉన్నారు..సినిమా రంగంలో కొత్త వచ్చే వారిలో ఎక్కువ మంది హీరోలు చిరంజీవి అభిమానులే ఉన్నారని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చాలా మంది హీరోలు, స్వయంగా అనేక వేదికపై చెప్పడం ఇటీవల మనం చూస్తున్నాం. అదే తరహాలో చిరంజీవి కూడా చిన్న హీరోల ఆడియో పంక్షన్లకు హాజరై అభిమానులను అశ్చర్యపరుస్తూ ఉంటారు..

ఆలాంటి సంఘటనే నటుడు అలీకి జరిగింది. రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికి మెగాస్టార్.. తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం తను ఎంతో ఇష్టపడే ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా నటుడు అలీ మరియు అతని కుటుంబ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికి మెగాస్టార్.. తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.

అనంతరం తను ఎంతో ఇష్టపడే అలీని, అతని ఫ్యామిలీని ప్రేమపూర్వకంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేయడంతో.. ఆ ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని మెగాస్టార్‌తో పంచుకోవడం ఎంతో అందంగా, ఆనందంగా వుందని అన్నారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని పేర్కొన్నారు.

అలీ, అతని ఫ్యామిలీ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవితో అలీ మరియు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, నటుడు అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రీసెంట్‌గా ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus