బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న అలియా భట్ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ కు జోడీగా అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించగా తారక్ కొరటాల శివ కాంబో సినిమాలో కూడా అలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలియా భట్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ భాష గురించి అలియా భట్ కామెంట్లు చేయడం గమనార్హం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ కు అలియా భట్ హాజరయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాడని ఎన్టీఆర్ మాట్లాడే భాష తనకు అర్థం కావడం లేదని అలియా భట్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చెప్పే మాటలను ఎవరైనా ట్రాన్స్ లేట్ చేస్తారని తాను దిక్కులు చూస్తూ ఉంటానని అలియా తెలిపారు.
అయితే అలియా భట్ కామెంట్లకు ఎన్టీఆర్ స్పందిస్తూ తాను తెలుగులోనే కాదని హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా మాట్లాడుతున్నానని కామెంట్లు చేశారు. అయితే తాను మాట్లాడే మాటలు అలియా భట్ కు మాత్రం అర్థం కావడం లేదని తారక్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా అలియా భట్ మాత్రం తారక్ హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడలేదని నవ్వుతూ ఎదురుదాడి చేయడం గమనార్హం. అలియా చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే అలియా సరదాగానే అలా కామెంట్లు చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తారక్ తెలుగు, కన్నడ, తమిళం, హిందీతో పాటు ఇంగ్లీష్ లో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళంలో మాట్లాడి తారక్ అందరినీ అవాక్కయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరకు పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఈ సినిమాకు రుద్ర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!