బాలీవుడ్ నటి ఆలియా భట్ దంపతులు గత ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే నవంబర్ నెలలో ఈ దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో వీరి గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చాయి. పెళ్లి కాకుండానే ఆలియా ప్రెగ్నెంట్ అని అందుకే ఏడు నెలలకే బిడ్డకు జన్మనిచ్చారంటూ పెద్ద ఎత్తున ఈ దంపతుల గురించి ట్రోలింగ్స్ వచ్చాయి.
ఇకపోతే ఆలియా గత ఆదివారం ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ కి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి అడ్మిట్ అయ్యారు అనంతరం కొన్ని గంటలకే అలియా భట్ కూతురికి జన్మనిచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయాన్ని ఆలియా భట్ సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇకపోతే గురువారం అలియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒక అలియా భట్ ఇంటికి వచ్చారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున బంధువులు సన్నిహితులు తన కూతురిని చూడటం కోసం ఇంటికి వస్తున్నారట అయితే ఇలా ఇంటికి వచ్చే బంధువులు లేదా స్నేహితులు తన కుమార్తెను చూడాలంటే అలియా భట్ కొన్ని కండిషన్లు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.చిన్నారి దగ్గరకు ఎవరైనా వెళ్లాలంటే తప్పనిసరిగా వాళ్ళు ఈ రూల్స్ పాటించాల్సిందేనని అలియా దంపతులు కండిషన్ పెట్టారట.
ఎవరైనా తన కూతురిని చూడటానికి వెళ్తే తప్పనిసరిగా వాళ్లు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలంటూ కండిషన్ పెట్టడంతో ఎంతోమంది ఈ కండిషన్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయితే తమ చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలియా దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ విషయం తెలిసిన కొందరు ఇది చాలా టూమచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.