‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి తెలుగు సినిమా టాలెంట్ అర్థమైందో, లేదంటే ఎప్పటి నుండో అనుకుంటూ… ఇప్పటికి వీలైందో కానీ ఆలియా భట్‌కి తెలుగు సినిమాల మీద మక్కువ ఎక్కువైంది. ఈ మాట మేం చెప్పడం కాదు. ఆమె మాటలు వింటుంటే అదే అర్థమవుతోంది. ‘గంగూభాయి’ సినిమా ప్రచారం మొదలుపెట్టిన ఆలియా భట్ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమెను ఇంట్లో ఏమని పిలుస్తారో చెప్పింది, అలాగే ఎవరితో నటించాలని ఉందో కూడా చెప్పింది.
టాలీవుడ్‌లో రీసెంట్‌గా ఎక్కువగా వినిపిస్తున్న కథానాయిక పేరు ఆలియా భట్. తారక్ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఆలియాను తీసుకుంటున్నారని చాలా రోజులుగా వార్తలొచ్చాయి. దానిపై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి స్వీట్ లాంటి న్యూస్ వచ్చింది. కొరటాల – ఎన్టీఆర్ సినిమా గురించి చర్చలు సాగుతున్నాయని, ఇంకా ఓకే చెప్పలేదని, మా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నానని కూడా చెప్పంది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నానని కూడా చెప్పింది.
అలా ఎన్టీఆర్ సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ… తెలుగులో ఇంకా ఏ హీరోతో నటించాలని ఉందో… చెప్పేసింది ఆలియా. ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జునే ఆ హీరో. బన్నీతో ఆమె నటించాలి అనుకోవడం వెనుక ఓ కారణం ఉందట. అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఉంది. ఇది నా ఇష్టం మాత్రమే కాదు, మా ఇంట్లో డిమాండ్ కూడా అని చెప్పింది ఆలియా. ‘పుష్ప’ సినిమా తర్వాత మా ఇంట్లో అంతా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు. అంటూ బన్నీని పొగిడేసింది ఆలియా.
ఆలియాను ఇంట్లోవాళ్లంతా ‘ఆలు’ అని పిలుస్తుంటారట. ‘అల్లుతో ఆలు సినిమా ఎప్పుడు?’ అని అడుగుతున్నారట. అందుకే అల్లు అర్జున్‌తో సినిమా చేసే అవకాశం వస్తే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటా అని చెప్పింది అలియా. ఇప్పుడు బన్నీ సినిమాల సంగతి చూస్తే… ‘పుష్ప 2’ తర్వాత చేసే సినిమాల మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. వరుసగా దర్శకులు అయితే కథలు చెప్పి ఉన్నారు. కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. అప్పుడు అందులో ఆలియా ఉంటుందో లేదో చూడాలి.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!