Jr NTR, Alia Bhatt: ఎన్టీఆర్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన అలియాభట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న అలియా.. ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయంపై అలియా భట్ స్పందించింది.

Click Here To Watch

ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమెకి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కొరటాల శివ సర్ తో మాట్లాడాను. నా పాత్ర గురించి చెప్పారు. ఆయన ఇప్పటి వరకు చాలా మంచి సినిమాలు తీశారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమా గురించి నేను ఎలాంటి కామెంట్ చేయాలనుకోవడం లేదు. అయితే… మా కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాను. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.

చిరంజీవి గారు, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ గారు తీసిన ‘ఆచార్య’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలియా మాటలను బట్టి చూస్తుంటే.. ఆమె ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లే అని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 7న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్‌ లీడ‌ర్‌గా కనిపించనున్నారు. గతంలో కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus