Alia Bhatt: రాహాను ఇటువైపు తీసుకురాం: ఆలియా షాకింగ్‌ కామెంట్స్‌!

నెపోటిజం… అంటూ సినిమా వాళ్లను బయటి వాళ్లు, సినిమాలు చూసేవాళ్లు తెగ ఆడిపోసుకుంటూ ఉంటారు. వాళ్ల వల్ల ఇతరులకు అవకాశాలు పోతున్నాయి అంటూ ఆందోళన చెందుతుంటారు కూడా. అయితే ఇదేదో కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే ఉంది అనేలా మాట్లాడుతుంటారు. ఇలాంటి మాటలు పడ్డ, పడుతున్న, పడే హీరోయిన్లలో ఆలియా భట్‌ ఒకరు. తొలి సినిమా నుండి ఇప్పుడు నాయికగా నిరూపించుకున్నాక కూడా ఆమె ఇలాంటి మాటలు పడుతూనే ఉన్నారు.

అయితే ఈ మాటల ప్రభావమో, ఇంకొకటో కానీ ఆమె ఇప్పుడు తన వారసురాలిని ఇటువైపు తీసుకురాను అంటున్నారు. అవును, బాలీవుడ్‌లో హీరోయిన్ల కూతుళ్లు హీరోయిన్లు అవ్వడం పెద్ద విషయం కాదు. చాలామంది అయ్యారు, అవుతున్నారు కూడా. అయితే తన కూతురు రాహా.. తనలాగా సినిమా రంగంలోకి రాకూడదు అని అనుకుంటున్నామని ఆలియా భట్‌ చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అంటూ లెక్కలు, చిక్కులు వేసేస్తున్నారు.

అంతలా ఏం జరిగింది అని అనుకుంటున్నారు. ‘రాహా నాలాగా సినిమా రంగాన్ని ఎంచుకొని, నా అడుగు జాడల్లో నడవాలని కోరుకోవడం లేదు’ అంటూ మొదలుపెట్టిన ఆలియా భట్‌… ‘నా కూతురు గొప్ప గొప్ప పరిశోధనలు చేసి శాస్త్రవేత్త కావాలని’ అనుకుంటున్నాను అని మనసులో మాట చెప్పేసింది. కొత్త సినిమా ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమా ప్రచారంలో ఉన్న ఆలియా ఇటీవల కుమారై భవిష్యత్తు గురించి మాట్లాడింది. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

అయితే, ఆలియా (Alia Bhatt) నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే.. ఇంకొదరు ఆమె నిర్ణయం మీద జోకులేసుకుంటున్నారు. మంచి ఆలోచన పిల్లల్ని మంచిగా ఎదగనివ్వాలి అని కామెంట్స్‌ చేస్తే.. ఇంకొందరు ‘ఆమె సినిమాలో శాస్త్రవేత్త అవుతుంది… ఆమె కోసం కథను సిద్ధం చేస్తున్నారు. తప్పక శాస్త్రవేత్తగా కనిపిస్తుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. మరి ఇప్పుడున్న మాటలే తర్వాతా ఉంటాయా? రాహా ఏమవుతుంది అనేది చూడాలి. మరి రణ్‌బీర్‌ కపూర్‌ మనసులో ఏముందో చూడాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus