Alia Bhatt: అలియాపై ప్రేక్షకుల్లో ఇంత నెగిటివిటీనా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సినిమా కోసం అలియా భట్ 9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా అలియా భట్ పాత్ర సినిమాలో కేవలం 15 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే తెలుగు సినిమాలలో ఈ బ్యూటీకి సినిమా అఫర్లు దక్కుతుండటం గమనార్హం. అలియా భట్ టాలీవుడ్ హీరోయిన్లను మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Click Here To Watch

అయితే తాజాగా అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల స్థాయిలో ఈ సినిమా లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే అలియా భట్ పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో తీవ్రమైన నెగిటివిటీ ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నెపోటిజం వల్ల అలియా భట్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అలియా భట్ నటించిన సడక్2 ట్రైలర్ కు ఊహించని స్థాయిలో డిస్ లైక్స్ వచ్చాయి. గంగూబాయి కతియావాడీ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ కేవలం 3.7గా ఉండటం గమనార్హం. బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే అలియాపై ఉన్న నెగిటివిటీ వల్ల ఈ సినిమాకు తక్కువ ఐఎండీబీ రేటింగ్ వచ్చిందని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీపై అలియా ఎఫెక్ట్ పడకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

అలియా భట్ సైతం వివాదాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ లో మాత్రం అలియా భట్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus