Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే ‘గంగూబాయ్’!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవల కరోనా వైరస్ బారిన పడింది. ఆ తరువాత కోలుకొని లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు రావడంతో ఆమె షూటింగ్ కు రెడీ అవుతోంది. ముందుగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూభాయ్’ సినిమాను పూర్తి చేయనుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక రోజు షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని సమాచారం. అది కూడా ఓ పాట అని తెలుస్తోంది.

జూన్ 15 తరువాత షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ డేలో పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు భన్సాలీ. ఈ పాట కోసం చాలా మంది డాన్సర్లను తీసుకోవాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వ్యాక్సిన్ వేయించుకున్న ముప్పై మంది డాన్సర్లతో ఈ పాటను పూర్తి చేయనున్నారు. ఈ షూటింగ్ పూర్తయిన తరువాత అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ మీదకు రాబోతుంది. తను షూటింగ్స్ కు సిద్ధంగా ఉన్నానని రాజమౌళికి సమాచారం అందించిందట ఈ బ్యూటీ.

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ కు అనుమతులు ఇచ్చిన వెంటనే రాజమౌళి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. అదే షెడ్యూల్ లో అలియా కూడా పాల్గోనుంది. ఇందులో అలియా సీత పాత్రలో కనిపించనుంది. కొన్నాళ్ల క్రితం ఆమె ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus