Alia Bhatt Wedding Date: స్టార్ హీరోయిన్ పెళ్లి ఎప్పుడంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చాలాకాలంగా రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉంది. ఈ ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీరి వివాహం ఎప్పుడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికీ ఈ విషయంపై అలియా కానీ.. రణబీర్ కానీ స్పందించింది లేదు. ఇప్పుడు మరోసారి వీరి పెళ్లి టాపిక్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ లో అలియా-రణబీర్ పెళ్లి ఖాయమని..

రాజస్థాన్ లోని డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. రాజస్థాన్‌లోని ఐకానిక్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ జంట డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేశారట. దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టినట్లు టాక్. పెళ్లి డేట్ ఫిక్స్చేసుకున్నప్పటికీ .. బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. కొన్నిరోజుల క్రితం నటి లారా దత్తా సైతం అలియా-రణబీర్ ల పెళ్లిపై స్పందిస్తూ.. 2021 డిసెంబర్ లో వీరి పెళ్లి జరగనుందని.. 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పింది.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా.. అలియాభట్ తెలుగులో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus