Alia Bhatt,Mahesh Babu: ఆ సినిమా ఏమో కానీ.. ఈ సినిమా పక్కా అంటున్నారు!

  • March 8, 2022 / 12:32 PM IST

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అవకాశం కల్పించింది ఆలియా భట్‌. ఇదిగో, అదిగో అంటూ అప్పటివరకు ఆలియా తెలుగు సినిమా గురించి వార్తలు వస్తూ ఉండేవి. అయితే ‘ఆర్ఆర్ఆర్‌’తో ఆ పుకార్లను నిజం చేశారు రాజమౌళి. రామ్‌చరణ్‌ సరసన ఆ సినిమాలో ఆలియా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి సినిమా ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ సినిమా అని ఆ మధ్య వినిపించింది. కానీ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మరో పుకారు మొదలైంది.

రాజమౌళి – మహేష్‌బాబు సినిమా గురించి మీకు తెలిసిందే. ఇది కూడా ఎన్నో ఏళ్లుగా నానుతున్న సినిమా. ఇదిగో, అదిగో అంటూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ‘ఆర్‌ఆర్ఆర్‌’ రాజమౌళి చేసే సినిమా ఇదే అని లేటెస్ట్‌గా అంటున్నారు. ఈ ఏడాది సినిమా స్టార్ట్‌ అవ్వడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయ్యింది అనేది లేటెస్ట్‌ పుకారు. ఆలియా భట్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నారట.

రాజమౌళి – మహేష్‌ సినిమా అంటే కచ్చితంగా పాన్‌ ఇండియా మూవీనే అవుతుంది. సిట్యువేషన్‌ డిమాండ్స్‌ ఉంటాయి మరి. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, మాలీవుడ్‌ అంటూ అన్ని వుడ్స్‌ నుండి నటులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ నుండే హీరోయిన్‌ను తీసుకోవాలని జక్కన్న అనుకుంటున్నారట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా నటకు ఇంప్రెస్‌ అయిన రాజమౌళి… మహేష్‌ సినిమాకు కూడా ఆమెనే ఫైనల్‌ చేశారని టాక్‌. జంగిల్‌ అడ్వంచరెస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

ఇప్పటికే విజయేంద్రప్రసాద్‌ ఈ కథను ఓ కొలిక్కి తెచ్చారని కూడా అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల అయిపోయిన తర్వాత… ఈ సినిమా గురించి రాజమౌళి ఆలోచిస్తారని అంటున్నారు. ఈలోపు మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా పూర్తి చేసుకొని వచ్చేస్తారట. అప్పుడు జక్కన్న సినిమా స్టార్ట్‌ అవుతుందని అంటున్నారు. అయితే ఎప్పుడు పూర్తవుతుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. పరిస్థితుల బట్టి ఉంటుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus