‘సాహో’ ప్రమోషన్స్ లో హైలెట్ అవుతున్న ప్రభాస్ వాచ్

‘బాహుబలి’ చిత్రంతో ఇండియన్ లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రం వచ్చిన రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత ‘సాహో’ చిత్రంతో వస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంతో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఆగష్టు 30 న విడుదల కాబోతున్న ‘సాహో’ చిత్రానికి ప్రమోషన్స్ డోస్ పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా ప్రభాస్ ట్రెండీ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ చేతికి ధరించిన వాచ్ పెద్ద హైలెట్ గా నిలుస్తుంది. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్ కు కూడా ప్రభాస్ ఇదే వాచ్ పెట్టుకుని హాజరవుతున్నాడు.

ఇప్పుడు ఈ వాచ్ ధర ఎంత, ఆ వాచ్ ఏ కంపెనీది అనే డిస్కషన్లు మొదలయ్యాయి. దీంతో గూగుల్ లో తెగ సెర్చింగ్ లు జరుగుతున్నాయి. అలా ఇన్ఫర్మేషన్ రాబట్టేసారు. ఆ వాచ్ ‘హబ్లోట్’ కంపెనీ వాచ్ అట. దీని ధర 50 లక్షల నుండీ కోటి వరకు ఉండొచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశం పై సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus