Sudigaadu2: ‘సుడిగాడు 2’కు సిద్ధమవుతున్న అలర్లి నరేశ్‌.. ఈసారి అంతకుమించి!

ఒక్క టికెట్‌పై వంద సినిమాలు… ఈ మాట ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. ఇప్పుడు అయితే టీవీల్లో వింటుండొచ్చు… కానీ థియేటర్‌లో ఈ మజాను తీసుకొచ్చిన చిత్రం ‘సుడిగాడు’. అల్లరి నరేశ్‌, భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా వచ్చి సుమారు 12 ఏళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు మరోసారి ఇదే ఫీట్‌ రిపీట్‌ చేయబోతున్నారా? ఏమో అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే ‘సుడిగాడు 2’కి కథ సిద్ధమైంది అని అంటున్నారు.

నిజానికి ‘సుడిగాడు’ సినిమా రిలీజ్‌ అయ్యి భారీ విజయం అందుకున్న వెంటనే ‘సుడిగాడు 2’ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా కోసం దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కథ రాస్తున్నారు అని అన్నారు. అయితే ఆ తర్వాత ఆయన హవా తగ్గడం, నరేశ్‌ సీరియస్‌ సినిమాలవైపు వెళ్లడంతో మళ్లీ ఆ ముచ్చట వినిపించలేదు. అయితే ఇటీవల మళ్లీ ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. ఓ ఎనిమిది నెలల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుంది అని వార్తలొచ్చాయి కానీ అవ్వలేదు.

అయితే, ఇప్పుడు మరోసారి ‘సుడిగాడు 2’ సినిమా విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం నరేశ్‌ దగ్గరకు ఓ మంచి స్క్రిప్ట్‌ వెళ్లిందని… తొలిపార్టు తరహాలోనే హిట్‌ సినిమాల స్పూఫ్‌ సన్నివేశాలతో సినిమా కథను సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈసారి పాన్‌ ఇండియా సినిమాలకు స్ఫూఫ్‌ రెడీ అంటున్నారు. అయితే దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. భీమనేని చేస్తారా? లేక కొత్త దర్శకుడా అనేది చూడాలి.

పైన చెప్పినట్లు ‘సుడిగాడు’లో (Sudigaadu2) వంద సినిమాల రిఫరెన్స్‌లు కనిపిస్తాయి. ఆ సన్నివేశాలకు స్పూఫ్‌గా భీమనేని రాసుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు అంతే నవ్వు తెప్పించేలా లైటర్‌ వీన్‌లో ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ సినిమా వస్తే మాత్రం అదిరిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే అంతలా మన ప్రేక్షకులు నవ్వుకుని చాలా రోజులు అయ్యింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus