ప్రేమకథా చిత్రాలు కల్ట్ క్లాసిక్, కల్ట్ బ్లాక్ బస్టర్..లు గా మిగిలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక లిస్ట్ తీస్తే అందులో ‘7 / జి బృందావన కాలనీ’ సినిమా పక్కాగా ఉంటుంది. 18 ఏళ్ళ క్రితం అంటే 2004 అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరో రెగ్యులర్ సినిమాల్లో కనిపించే విధంగా కనిపించడు..! ఓ మూర్ఖుడిగా కనిపిస్తాడు.
హీరోయిన్ ను.. మొదటి నుండి కామంతోనే చూస్తాడు. కానీ ఆమెతో పడక సుఖం పొందినా.. ‘మోజు తీరిపోయింది కదా’ అని వదిలేయడు. ఆమె చనిపోయాక కూడా ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు. ఇలాంటి కథతో అప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ తర్వాత కూడా ఇంకో సినిమా రాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో తండ్రి, కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను కూడా ఈ మూవీలో చాలా నేచురల్ గా చూపించారు.
ఇప్పుడు రీ రిలీజ్…ల ట్రెండ్ నడుస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 4K కి డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేయాలని నిర్మాత ఏ.ఎం.రత్నం భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అతి త్వరలో రీ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. మరి ఈసారి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి