Adhurs: జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందంల హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘అదుర్స్’ రీ రిలీజ్ ఎప్పుడంటే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ స్మాల్ అప్‌డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో హంగామా చేస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇటీవలే ట్రిపులార్ కోసం జపాన్ వెళ్లి వాళ్ల భాషలో, కర్ణాటకకి వెళ్లి కన్నడలో మాట్లాడిన వీడియోలు, వాటి తాలుకు ఫొటోలను ఎంతలా ట్రెండ్ చేశారో చూశాం.. వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన జోష్‌లో ఉన్న తారక్ అభిమానులకి మరింత కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది..

టాలీవుడ్‌లో కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాల స్పెషల్ షోలు.. ఇంకో అడుగు ముందుకేసి ఫిలిం నుండి డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్‌గా డైరెక్టర్ల ట్రెండ్ కూడా మొదలైంది.. త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా ‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్ చేశారు. అక్కినేని నటించిన ‘ప్రతిబింబాలు’ 40 ఏళ్ల తర్వాత విడుదల కాబోతుంది..

ఇప్పటికే ‘ఆది’ మూవీ స్పెషల్ షోలతో రచ్చ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి సంబరాలకి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అదుర్స్’ రీ రిలీజ్ కాబోతోంది.. చారి క్యారెక్టర్‌లో చెలరేగిపోయాడు ఎన్టీఆర్.. తొలిసారి పూర్తిస్థాయి పాత్రలో హాస్యాన్ని పండించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇక హాస్యబ్రహ్మ బ్రహ్మానందం అయితే భట్టుగా విశ్వరూపం చూపించారు.. ఇప్పటికీ ఏ న్యూస్ అయినా చారి, భట్టుల మీమ్స్ ఉండాల్సిందే.. పంచులు వినబడాల్సిందే.. కనబడాల్సిందే..

2010 సంక్రాంతికి సూపర్ హిట్ అయిన ఈ సాలిడ్ సినిమాని లేటెస్ట్ టెక్నాలజీతో త్వరలో ప్రేక్షకాభిమానుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి.. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్, జూనియర్‌ల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం రీ రిలీజ్ గురించిన వివరాలు కొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడించనున్నారు. తారక్ సన్నిహితులు, రాజకీయ నాయకులు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus