నవ్వుకోనికీ మీరు కూడా థియేటర్‌కి వస్తారుగా..

గతేడాది సంక్రాంతి సినిమాల్లో F2 చేసిన సందడి గుర్తుందా. ఎలా మరచిపోతాం… ఫన్‌, ఫ్రస్టేషన్‌ అంటూ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ చేసిన సరదాలు, పడిన తంటాలు, పెట్టిన గిలిగింతలు, సంపాదించిన వసూళ్లు వావ్‌ అసలు. ఆ సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో F3 అంటూ టీజ్‌ కూడా చేశాడు. దీంతో ఎఫ్‌ 2కి సీక్వెల్‌ ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అయితే ఆ తర్వాత చాలా రోజుల పాటు దీని మీద ఎలాంటి సమాచారం లేదు. ఉంటుందా లేదో చెప్పలేదు. అయితే ఇటీవల ఎఫ్‌3 ఉంటుందంటూ బలమైన వార్తలే వచ్చాయి. ఈ రోజు అవి నిజమని తేలిపోయాయి.

విక్టరీ వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా దిల్‌ రాజు టీమ్‌ ఓ వీడియోను రిలీ్‌ చేసింది. అందులో ఎఫ్‌2ను గుర్తు చేసుకుంటూ ఆ సినిమాలోని సీన్స్‌ చూపించారు. ఆఖరులో ఎఫ్‌3కి సిద్ధమవ్వండి అంటూ టీజ్‌ చేశారు. దాంతోపాటు సినిమా కాన్సెప్ట్‌ను చూచాయిగా చూపించారు కూడా. ఫన్‌, ఫ్రస్టేషన్‌, మోర్‌ ఫన్‌ అంటూ సినిమా లైన్‌ను చెప్పారు. దాంతోపాటు 500 రూపాయల నోట్లను ప్రధానంగా చేసుకుంటూ లోగోను క్రియేట్‌ చేశారు. కాన్సెప్ట్‌ పోస్టర్‌లోనూ మొత్తం డబ్బులు నింపేశారు. అంటే పెళ్లి, ప్రేమ, డబ్బు ఈ మూడు అంశాల చుట్టూ ఎఫ్‌3 ఉండబోతోందన్నమాట.

ఎఫ్‌3లో ఎవరు నటిస్తారనే విషయంలో పెద్దగా ఆలోచించక్కర్లేదు. వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ పక్కా. కథానాయికలు విషయంలో క్లారిటీ వచ్చేసింది. తమన్నా, మెహరీన్‌ కొనసాగుతారు. అయితే మొదటి నుంచి వినిపిస్తూ వచ్చిన మూడో హీరో ఎవరు అనే టాపిక్‌లో ఇంకా క్లారిటీ లేదు. అసలు మూడో హీరో ఉంటాడా అనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది. అయితే ఎఫ్‌3లో ఐదుగురు హీరోయిన్లు ఉండబతోతున్నారనే వార్తలూ వచ్చాయి. మరి ఉంటారా లేదా… కొత్తవాళ్లు ఎవరొస్తారనే విషయాలు డైరక్టర్‌, ప్రొడ్యూసర్‌ చూసుకుంటారనుకోండి. మనం మాత్రం దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎలాంటి వినోదం పండిస్తాడో ఆలోచిస్తూ ఉందాం. ఆయన ప్రతిసారి నవ్విస్తూనే ఉన్నాడుగా. ఈ సారీ అదే చేస్తాడు.

హెడ్డింగ్‌లో నవ్వుల వ్యాక్సిన్‌ అని ఏదో రాశారు. ఆ మాట చెప్పలేదేంటి అంటున్నారు. ఈ మాట అన్నది మేం కాదు వీడియోలో వెంకటేశ్‌ చెప్పిన మాట అది. ‘నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకొచ్చేస్తున్నాం’ అని వెంకటేశ్‌ అంటే… ‘నవ్వుకోనికీ మీరు కూడా థియేటర్‌కి వస్తారుగా మళ్లా…’ అని వరుణ్‌తేజ్ అన్నాడు. అదన్నమాట మేటర్‌.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus