Bigg Boss Telugu 5: గ్రాండ్ ఫినాలేకి గ్రాండ్ గా వచ్చిన గెస్ట్ లు వీళ్లే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకి చేరుకుంది. గ్రాండ్ ఫినాలే ఆదివారం నాలుగు గంటల పాటు ప్రసారం కాబోతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఫినాలే స్టేజ్ ని ఏర్పాటు చేసింది బిగ్ బాస్ టీమ్. అంతేకాదు, గత రెండు సీజన్స్ లో మెగాస్టార్ చిరంజీవి రాకతో హౌస్ మేట్స్ లో ఫుల్ జోష్ వచ్చేది. అయితే, ఈసారి అంతకుమించి ఉండాలని గెస్ట్ లతో ఫినాలే స్టేజ్ దద్దరిల్లిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఇందులో భాగంగా శ్యామ్ సింగరాయ్ టీమ్ లో నేచరల్ స్టార్ నాని మరోసారి బిగ్ బాస్ స్టేజ్ పైన సందడి చేసినట్లుగా తెలుస్తోంది. సాయిపల్లవితో కలిసి వచ్చిన నేచరల్ స్టార్ నాని తనదైన స్టైల్లో హౌస్ మేట్స్ ని పలకరించి పంచ్ లు వేశాడు. ఇక నాగార్జునతో కలిసి చేసిన ఫన్ ఎపిసోడ్ కి హైలెట్ కాబోతోంది. బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ పైన ఎక్స్ పార్టిసిపెంట్స్ డ్యాన్స్ పెర్ఫామన్స్ లతో మారుమోగిపోయింది.

లహరి, హమీదా, కాజల్, ఉమాదేవి, సరయు డ్యాన్స్ లతో అలాగే రవి , విశ్వ, నటరాజ్ మాస్టర్స్ పెర్ఫామన్స్ లతో హోరెత్తిపోయింది. ఆ తర్వాత స్పెషల్ గెస్ట్ లు గా 83 సినిమా టీమ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రణబీర్ సింగ్, దీపికా పదుకొనే, హీరో జీవాలు స్టేజ్ పైన సందడి చేశారు. వీళ్ల రాకతో స్టేజ్ పైన ఉన్న పార్టిసిపెంట్స్ , అలాగే హౌస్ లో ఉన్నవాళ్లు ఫుల్ ఖుషీ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక ఫినాలే స్టేజ్ పైకి ఇద్దరు పార్టిసిపెంట్స్ ని తెచ్చేందుకు రాజమౌళి అండ్ టీమ్ స్పెషల్ గా వచ్చినట్లుగా టాక్. రామ్ చరణ్, అలియాభట్, ఇంకా రాజమౌళి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేయబోతోంది బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ ఇలా సెలబ్రిటీల రాకతో దద్దరిల్లబోతోంది. ఇక ఇప్పటికే సోషల్ మీడియా టాక్ ప్రకారం విజె సన్నీ విన్నర్ గా అయినట్లుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.

[yop_poll id=”7″]

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus