Chiranjeevi, Trivikram: మెగాస్టార్ తో త్రివిక్రమ్ సక్సెస్ సాధిస్తారా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటివరకు మహేష్ కు టోటల్ స్క్రిప్ట్ చెప్పలేదని తెలుస్తోంది. సర్కారు వారి పాట మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత మహేష్ మూవీపై త్రివిక్రమ్ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ రావడంతో వేగంగా సినిమాలను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు బోగట్టా. ఇకపై వేగంగా సినిమాలను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో చిరంజీవి త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. డీవీవీ దానయ్య నిర్మాతగా చిరంజీవి త్రివిక్రమ్ కాంబో మూవీ తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. అభిమానులు చిరంజీవి త్రివిక్రమ్ కాంబో సినిమాపై ఆసక్తిని చూపిస్తున్నారు. మాటల మాంత్రికుడు చిరంజీవితో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.

త్రివిక్రమ్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను ప్లాన్ చేస్తుండటంతో మాటల మాంత్రికుడి ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అల వైకుంఠపురములో సినిమా త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus