Vishwambhara: విశ్వంభర టీజర్ విషయంలో ఆయన గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా?

చిరంజీవి  (Chiranjeevi)  మల్లిడి వశిష్ట (Mallidi Vasishta)  కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వంభర (Vishwambhara)  సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. మొదట ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మేకర్స్ క్లారిటీ ఇస్తున్నా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం విశ్వంభర మూవీ డేట్ విషయంలో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అయితే ఎట్టకేలకు విశ్వంభర మూవీ టీజర్ సిద్ధమైంది. దసరా పండుగ కానుకగా ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Vishwambhara

అయితే విశ్వంభర టీజర్ విడుదల కావాలంటే చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వంభర సినిమా క్రేజీ ట్విస్టులతో ఉండబోతుందని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. విశ్వంభర సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని మల్లిడి వశిష్ట ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను ఈ సినిమాతో బ్రేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విశ్వంభర సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ సినిమాలలో ఒకటి కాగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. విశ్వంభర సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. విశ్వంభర సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూస్తామనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. విశ్వంభర సినిమా సింగిల్ పార్ట్ గానే తెరకెక్కుతుందని ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని భోగట్టా.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. విశ్వంభర సినిమాలో త్రిష (Trisha)  హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టాలిన్   (Stalin) విడుదలైన ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కావడం గమనార్హం. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తే అభిమానుల ఆనందానికి సైతం అవధులు ఉండవని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రముఖ హాలీవుడ్ నటి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus