RRR: ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రముఖ హాలీవుడ్ నటి!

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ విడుదలై రెండున్నర సంవత్సరాలు అయినా ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటి ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మూడు నెలలకొకసారి ఆర్ఆర్ఆర్ చూస్తానంటూ ఆ నటి చేసిన కామెంట్లు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ నటి మిన్నీ డ్రైవర్ ఈ కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో మిన్నీ డ్రైవర్ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.

RRR

ఆర్ఆర్ఆర్ నా ఫేవరెట్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు. నా కొడుకుతో కలిసి ఆర్ఆర్ఆర్ చూడటం నాకు చాలా ఇష్టం అని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమా మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అని ఆమె కామెంట్లు చేశారు. ఆ రీజన్ వల్లే మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా ఈ సినిమా చూస్తానని మిన్నీ డ్రైవర్ వెల్లడించారు. అద్భుతమైన, అందమైన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి అని మిన్నీ డ్రైవర్ తెలిపారు.

ఇండియన్ చెఫ్ రోమ్ గిల్ తో స్నేహం గురించి మిన్నీ మాట్లాడుతూ రోమీ నాకు మంచి ఫ్రెండ్ అని తెలిపారు. తను చాలా బాగా వంట చేస్తుందని మిన్నీ పేర్కొన్నారు. భారత్ కు వచ్చి భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలను చూడాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ద సర్పెంట్ క్వీన్ సీజన్2 లో తాజాగా మిన్నీ డ్రైవర్ యాక్ట్ చేశారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లయన్స్ గేట్ ప్లేలో ద సప్రెంట్ క్వీన్ సీజన్2 ప్రసారమవుతోంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ ప్రాజెక్ట్ సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్ (Ram Charan) , తారక్  (Jr NTR) ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

గోపీచంద్ ‘విశ్వం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus