Jigarthanda: ‘జిగర్‌తండా’ ప్రీక్వెల్‌ డేట్‌ ఇచ్చేశారు.. లారెన్స్‌, సూర్య ఉగ్రూపం చూడటానికి రెడీనా?

నేటితరం సినిమా లవర్స్‌కి ‘జిగర్‌ తండ’ క్లాసిక్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ కాని సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌. తమిళంలో బెస్ట్ డ్రామా థ్రిల్లర్‌గా నిలిచిన ‘జిగర్‌ తండ’ మజాని మరోసారి తీసుకొస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం టీమ్‌ అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు ఓ టీజర్‌ కాని టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పుడు సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేశారు. తమిళనాడులో సమ్మర్‌ డ్రింక్‌ అయిన ‘జిగర్‌తండా’ను దీపావళికి తీసుకొస్తామని చెప్పారు.

‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కార్తీక్ సుబ్బరాజ్‌. ‘జిగర్ తండ’ సినిమాతో ఇటు ప్రేక్షకుల్ని, అటు సినీ విమర్శకులను మెప్పించారు. అందులో అతను ఎంచుకున్న కథ, అనుసరించిన స్క్రీన్ ప్లే, తీర్చిదిద్దిన పాత్రలు.. ఆ సినిమాకు కల్ట్ స్టేటస్ తీసుకొచ్చాయి. తమిళ వెర్షన్‌ను ఇతర భాషల వాళ్లు కూడా చూసి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా, హిందీలో ‘బచ్చన్ పాండే’గా రీమేక్ అయింది. తెలుగు, హిందీ భాషల్లో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు.

కార్తిక్‌ సుబ్బరాజు ఆ తర్వాత ‘ఇరైవి’, ‘పేట’, ‘జగమేతంత్రం’, ‘మహాన్’ లాంటి పెద్ద సినిమాలే చేశారు.. కానీ అవేవీ విజయాలు అందించలేదు. దీంతో తనకు ఎంతో పేరు తెచ్చిన ‘జిగర్‌ తండ’ సినిమా ప్రీక్వెల్‌ ఎత్తుకున్నారు కార్తిక్‌ సుబ్బరాజ్‌. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ అనే టైటిల్ పెట్టి, రెండు గన్నులతో డిఫరెంట్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దీనికి వెరైటీ టీజర్ కూడా యాడ్‌ చేశారు. (Jigarthanda) ‘జిగర్ తండ’లో హీరో, విలన్ పాత్రలు చేసిన సిద్దార్థ్, బాబీ సింహా ఇందులో లేరు. వారికి బదులు లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య వచ్చారు.

ఈ సినిమాను దీపావళికి తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి కూడా టీజర్‌ లాగే ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఓ థియేటర్‌ ముందు ఓ వ్యక్తి కుర్చీ వేసుకుని కూర్చుంటే దాని ముందు మంట పెట్టి డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా కోసం సినిమా నేపథ్యంలో సాగుతుంది అనిపిస్తోంది. మరి తొలి సినిమాకు మించిన విజయం అందుకుంటుందో లేదో చూడాలి. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న కార్తిక్‌ సుబ్బరాజుకు ఈ సినిమా చాలా మంచి ఛాన్స్‌ అని చెప్పాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus