Narappa Movie: వెంకీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ‘నారప్ప’!

  • December 6, 2022 / 08:13 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘వి క్రియేషన్స్’ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘అసురన్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలు, లవ్ స్టోరీస్ తీసే శ్రీకాంత్ అడ్డాల.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు అనే అప్డేట్ రాగానే సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్ వచ్చాయో, ఎంత ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కానీ ఇలాంటి సినిమాను కూడా అద్భుతంగా తీయగలను అని శ్రీకాంత్ అడ్డాల ప్రూవ్ చేశాడు. అయితే థియేటర్లు తెరుచుకోలేని ప్రతికూల పరిస్థితులు నెలకొన్నందున ‘నారప్ప’ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దీంతో వెంకీ అభిమానులు చాలా నిరాశ చెందారు. తమ అభిమాన హీరో సినిమా ఓటీటీలో చూడటం ఏంటి అంటూ బాధపడ్డారు. అయితే ఎట్టకేలకు ‘నారప్ప’ ని థియేటర్లలో చూసే అవకాశం వారికి దక్కనుంది.

డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఈ మూవీ థియేటర్లలో అందుబాటులో ఉంటుంది. ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆసక్తిగా ఉన్న అభిమానులు హ్యాపీగా ఈ మూవీని చూడొచ్చు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పుట్టినరోజులకు వారి పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ‘నారప్ప’ థియేటర్లలో రిలీజ్ కాబోతుండడం ఇదే మొదటి సారి. ‘ఎఫ్3’ లో ‘నారప్ప’ థియేట్రికల్ గ్లింప్స్ ను చూశారు. ఇప్పుడు ఫుల్ మూవీ చూసి ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus