Nayakudu OTT: ఓటీటీకి ‘నాయకుడు’ ఎప్పటి నుండో తెలుసా?

తమిళంలో ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్… ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో వడివేలు, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. సెన్సిటివ్ టాపిక్స్ ని తీసుకుని సన్నివేశాలు రాసుకుని కథనాన్ని నడిపిస్తూ ఉంటారు అతను. అక్కడ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అక్కడ రూ.60 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో జూలై 14 న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఇక్కడ కూడా సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మంచి రివ్యూలు, రేటింగ్ లు పడ్డాయి. కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో ఓపెనింగ్స్ ఓ మాదిరిగా మాత్రమే వచ్చాయి. మరో రెండు, మూడు రోజుల్లో సినిమా ఫుల్ రన్ ముగుస్తుంది.

ఇక ఈ చిత్రం (Nayakudu) ఓటీటీ రిలీజ్ కి కూడా రంగం సిద్ధమైంది. జూలై 27 ‘మామన్నన్’ తమిళ్ తో పాటు మలయాళం, కన్నడ వెర్షన్స్ లో కూడా అదే రోజున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు వెర్షన్ ‘నాయకుడు’ కూడా అదే రోజు నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రిలీజ్ అయ్యి రెండు వారాలు కాకుండానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుండటం గమనార్హం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus