Prabhas: ప్రభాస్ ఫ్లాప్ మూవీ రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందా?

కొన్ని సినిమాలు మంచి కథ, కథనంతో తెరకెక్కినా వేర్వేరు కారణాల వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతుంటాయి. ప్రభాస్ సినీ కెరీర్ లో పాజిటివ్ టాక్ వచ్చినా ఫుల్ రన్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోని సినిమాలలో మున్నా ఒకటి. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా సాంగ్ ఊహించని స్థాయిలో హిట్టైంది.

సెకండాఫ్ లోని కొన్ని తప్పుల వల్ల ఈ సినిమా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. ప్రభాస్ సినిమాలు రీ రిలీజ్ లో మంచి కలెక్షన్లను సాధిస్తున్న నేపథ్యంలో మున్నా మూవీ రీ రిలీజ్ దిశగా అడుగులు పడుతున్నాయి. నవంబర్ నెలలో ఈ సినిమా రీ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది.

సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సలార్2 మూవీ ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై కూడా భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ప్రభాస్ (Prabhas) సినిమాలలో మరికొన్ని సినిమాలు సైతం రీ రిలీజ్ కానున్నాయని ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా ఇతర భాషల్లో కూడా క్రేజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ రిలీజ్ సినిమాలతో, రీ రిలీజ్ సినిమాలతో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus