Salaar Trailer: ‘సలార్’ సెకండ్ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ కోసం..అటు అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ఇది. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ‘సలార్’ రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న తెలుగు, కన్నడంతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ పర్వాలేదు అనిపించాయి కానీ.. అందులో ప్రభాస్ ఎక్కువ సేపు కనిపించకపోవడంతో.. అభిమానులు కొంత నిరాశ చెందారు అని చెప్పాలి. ప్రేక్షకులను ‘సలార్’ ప్రపంచంలోకి తీసుకెళ్లడం కోసమే టీజర్, ట్రైలర్స్ ను అలా కట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చాయి.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి(Salaar) ‘సలార్’ నుండి రిలీజ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల టాక్ నడిచింది. ఇప్పుడు దానికి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. డిసెంబర్ 17 న అంటే రేపు(ఆదివారం) ‘సలార్’ రిలీజ్ ట్రైలర్ రాబోతుంది. ఈ ఒక్క ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరగడం ఖాయమని ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది.

https://twitter.com/FilmyFocus/status/1736021026239373489

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus