Khushi Kapoor: శ్రీదేవి రెండో కూతురి సినిమాకు సర్వం సిద్ధమట!

జాన్వీ కపూర్‌… అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా 2018లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె రావడం, రావడం… టాలీవుడ్‌లో ఎప్పుడు అనే ప్రశ్న మొదలైంది. దానికి ఆమె నుండి ఎలాంటి సమాధానం లేకపోయినా, టాలీవుడ్‌లో మాత్రం ఆమె ఎంట్రీ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ హీరోతో సినిమా అని, ఆ హీరోతో సినిమా అని వరుస పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి పుకార్ల కోసం మరో నాయిక సిద్ధమవుతోంది. అది కూడా ఆ ఇంటి నుండే.

అవును, మీరు విన్నది నిజమే, అనుకుంటున్నది నిజమే. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ తెరంగ్రేటానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ నుండి ఆమె తొలి సినిమా షూటింగ్‌ ఉంటుందని సమాచారం. దీనిపై పూర్తి స్పష్టత లేకపోయినా… సినిమా ఓపెనింగ్‌ అయితే పక్కా అని అంటున్నారు. ఆ లెక్కన మన వాళ్లు కూడా శ్రీదేవి చిన్న కూతురు తొలి తెలుగు సినిమా ఇదే అంటూ ఓ మాట అనేసుకోవచ్చు. ఆ తర్వాత కాకపోతే కాదు అని కూడా అనేసుకోవచ్చు. అక్క విషయంలో ఇలానే జరిగింది, జరుగుతోంది కదా.

అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందతో కలసి ఖుషి… డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేస్తున్న వీడియో ఒకటి ఇటీవల బయటకొచ్చింది. అప్పటి నుండి ఖుషి తొలి సినిమా అగస్త్యతోనే అంటూ బాలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయం ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఖుషీ కపూర్‌ తొలి సినిమా చిత్రీకరణ ఏప్రిల్‌ నుండి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకే వివరాలు చెప్పలేను అని కూడా అన్నాడు.

దీంతో విషయం తెలిసింది కానీ, వివరం తెలియలేదు. జోయా అక్తర్‌ తెరకెక్కించనున్న ఓ సినిమాలో ఖుషీ కపూర్‌, అగస్త్య నందా, షారుక్‌ ఖాన్‌ తనయ సుహానా ఖాన్‌ నటిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, జోయా వీరితో స్క్రీన్‌ టెస్ట్‌లు, లుక్‌ టెస్ట్‌లు కూడా పూర్తి చేశారని సమాచారం. చూద్దాం… ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus