Varun Tej: ప్రవీణ్‌ సత్తారు – వరుణ్‌ సినిమా ఎప్పుడంటే?

కరోనా పరిస్థితుల కారణంగా సినిమాలు ఆలస్యం అవ్వడంతో… ఇప్పుడు వరుస సినిమాలు చేసేయడానికి రెడీ అవుతున్నారు మన హీరోలు. అలాంటి వారిలో వరుణ్‌తేజ్‌ ఒకరు. ‘గని’, ‘ఎఫ్ 3’ సినిమాలు వరుసగా వాయిదాలు పడ్డాయి. ఆఖరికి వచ్చిన ‘గని’ దారుణ ఫలితం ఇవ్వగా, ‘ఎఫ్‌ 3’ మే 27న విడుదలవుతోంది. ఈ సినిమా ఫలితం తేలగానే కొత్త సినిమాలు స్టార్ట్‌ చేయాలని చూస్తున్నాడట వరుణ్‌తేజ్‌. అందులో మొదటికి ప్రవీణ్‌ సత్తారు సినిమా.

ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రవీణ్‌ సత్తారు సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ బయటికొచ్చాయి. అలాగే సినిమాలో విలన్‌ ఎవరు అనే విషయం కూడా తెలిసింది. ఈ సినిమా కోసం తమిళ హీరో / విలన్‌ను ప్రవీణ్‌ సత్తారు ఫిక్స్‌ చేశారు అని సమాచారం. ‘డాక్టర్‌’, ‘డిటెక్టివ్‌’ సినిమాతో ఆకట్టుకున్న వినయ్‌ రాయ్‌ని ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను పూర్తిగా విదేశాల బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరిస్తారట.

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా సినిమా కథను సిద్ధం చేసుకున్నారట ప్రవీణ్‌ సత్తారు. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. లండన్‌లో సుమారు నెలన్నర ఏకధాటిగా షూటింగ్‌ జరిపి మెజారిటీ సినిమాను చిత్రీకరిస్తారట. లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసి, మిగతా 20 శాతం యూరోప్ దేశాల్లో చేస్తారట. ఇక పైన చెప్పిన విలన్‌ వినయ్‌ రాయ్‌… తెలుగు సినిమా ప్రేక్షకులకు పరియమే.

‘వాన’ లాంటి శాడ్‌ లవ్‌ స్టోరీలో హీరో గుర్తున్నాడా… ఆ హీరోనే ఈ వినయ్‌ రాయ్‌. ఆ సినిమా తమిళంలోకి వెళ్లిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. విశాల్‌ ‘డిటెక్టివ్‌’ సినిమాతో విలన్‌గా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌ ‘డాక్టర్‌’తో తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యారు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌ – ప్రవీణ్‌ సత్తారు సినిమాతో స్ట్రయిట్‌ తెలుగు సినిమా విలన్‌గా చేయబోతున్నాడన్నమాట. మరి ఈ ఇన్నింగ్స్‌లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus