సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. గతేడాది ఇండస్ట్రీ చాలా మంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది.అందులో కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాలు ఉన్నారు. ఈ ఏడాది అయినా అంతా బాగుంటుంది అని ఆశపడితే. ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇవివి సత్యనారాయణ తండ్రి అల్లరి నరేష్(Allari Naresh) తాతగారు అయినటువంటి ఈదర వెంకట్రావు గారు మృతి చెందారు.ఆయన వయసు 90 సంవత్సరాలు.వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన ఈరోజు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.ఈరోజు నిడదవోలు మండలం, కోరుమామిడిలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.
2019 మే 27న వెంకట్రావు గారి భార్య అయినటువంటి వెంకటరత్నం గారు మరణించారు. దీంతో ఆయన ఒంటరిగా జీవిస్తూ వస్తున్నారు.వెంకట్రావు గారికి ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు ఇవివి సత్యనారాయణ.2వ కుమారుడు ఇవివి గిరి.3వ కుమారుడు ఇవివి శ్రీనివాస్ గారు. ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ వారి మనుమలు.
ఇవివి సత్యనారాయణ టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు. శ్రీకాంత్, జగపతి బాబు, వడ్డే నవీన్ వంటి హీరోలకు లైఫ్ ఇచ్చింది ఆయనే. అలాగే ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్ ని కూడా హీరోగా లాంచ్ చేశారు. అతనికి ‘ఎవడిగోల వాడిదే’ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని కూడా అందించారు. ఇక అల్లరి నరేష్ అయితే కామెడీ సినిమాలతో స్టార్ గా ఎదిగాడు.