Allari Naresh, Rajamouli: జక్కన్న వల్ల డిజాస్టర్ అయిన అల్లరి నరేష్ సినిమా ఏదో తెలుసా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమాకు పోటీగా మరో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపరనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు సులువుగా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తున్నాయి. అయితే జక్కన్న సినిమా వల్ల అల్లరి నరేష్ సినిమా ఒకటి డిజాస్టర్ గా నిలిచింది.

ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ (Allari Naresh) అల్లరి నరేష్, వేణు కాంబినేషన్ లో అల్లరే అల్లరి సినిమాను తాను తెరకెక్కించానని జక్కన్న యమదొంగ సినిమా వల్ల మా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన విజయాన్ని అందుకోలేదని అన్నారు. అల్లరే అల్లరి సినిమా 2007 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన విడుదల కాగా యమదొంగ సినిమా అదే సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీన విడుదలైంది.

అల్లరే అల్లరి థియేటర్లలో బాగానే రన్ అవుతున్న సమయంలో యమదొంగ విడుదల కావడంతో పాటు బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. యమదొంగ సినిమాపై ఆసక్తి చూపిన ప్రేక్షకులు అల్లరే అల్లరి సినిమాను పట్టించుకోలేదు. అల్లరి నరేష్ ఖాతాలో ఒక డిజాస్టర్ చేరడానికి రాజమౌళి పరోక్షంగా కారణమయ్యారు. రాజా, సంక్రాంతి సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న ముప్పలనేని శివకు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు రావడం లేదు.

రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుండగా ఈ మూవీ షూట్ శరవేగంగా జరగనుందని సమాచారం అందుతోంది. రాజమౌళి ఈ సినిమాతో దేశవిదేశాల్లో సత్తా చాటుతానని నమ్మకంతో ఉన్నారు. హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus