Chiranjeevi Nagarjuna: నాగార్జున సినిమాలో అల్లరి నరేష్.. కానీ?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో చిరంజీవి తన సినిమాలో కచ్చితంగా మరో కీలక పాత్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కుతుండగా మెగాస్టార్ సినిమాలకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. అయితే నాగార్జున కూడా చిరంజీవిని ఫాలో అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున భవిష్యత్ ప్రాజెక్ట్ లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో నటించే సినిమాలో అల్లరి నరేష్ కనిపించనున్నారని సమాచారం.

ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రసన్న కుమార్ ఈ సినిమాతో దర్శకునిగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్రసన్న కుమార్ ఈ సినిమాతో దర్శకునిగా సక్సెస్ ను సొంతం చేసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిజీ డైరెక్టర్లలో ఒకరు అయ్యే ఛాన్స్ ఉంది. ప్రసన్న కుమార్ కథను అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. అల్లరి నరేష్ ఈ సినిమాలో సీరియస్ రోల్ లోనే కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. ఈ రీజన్ వల్లే భిన్నమైన కథలను ఎంచుకోవడానికి అల్లరి నరేష్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సినిమాతో అటు నాగార్జునకు ఇటు అల్లరి నరేష్ కు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడింది. అల్లరి నరేష్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నటుడిగా ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అల్లరి నరేష్ సైతం కెరీర్ విషయంలో టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ కు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus