Allari Naresh: నరేష్ మరో హిట్ సాధిస్తారా..?

అల్లరి నరేష్ సినీ కెరీర్ లో సుడిగాడు సినిమా వరకు సక్సెస్ ను సొంతం చేసుకున్న సినిమాలే ఎక్కువనే సంగతి తెలిసిందే. సుడిగాడు సినిమా తర్వాత మాత్రం అల్లరి నరేష్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి. అయితే రొటీన్ కథలకు భిన్నంగా ఈ ఏడాది నాంది సినిమాలో నటించి అల్లరి నరేష్ హిట్ సాధించాడు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

నాంది సినిమా ఇతర భాషల్లో రీమేక్ అవుతుండటం గమనార్హం. అయితే నరేష్ పుట్టినరోజు సందర్భంగా నరేష్ నటిస్తున్న సభకు నమస్కారం అనే సినిమా ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నరేష్ యువ రాజకీయనాయకుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ మూవీ పొలిటికల్ సెటైరిక్ మూవీ అని జనానికి కనెక్ట్ అయ్యే జానర్ కావడంతో సరిగ్గా తీస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందని నరేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేర్ ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం.

సతీష్ మల్లంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లరోడు ఈ సినిమాలో రాజకీయ నాయకులపై సెటైర్లు వేయబోతున్నారా..? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నరేష్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటే మాత్రం అల్లరోడి కెరీర్ కు ఢోకా ఉండదనే చెప్పాలి. ఒక జేబులో 2,000 రూపాయల నోట్ల కట్టలు, మరో జేబులో మందు బాటిల్ తో ఫస్ట్ లుక్ ద్వారా నరేష్ సినిమాపై అంచనాలను పెంచేశారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus