అల్లరి నరేష్ (Allari Naresh) కెరీర్‌లో లాండ్‌మార్క్‌గా నిలిచిన సినిమా ‘సుడిగాడు’ (Sudigaadu) . 2012లో విడుదలైన ఈ చిత్రం కామెడీ సెన్సేషన్‌గా మారి, నరేష్‌కు ప్రేక్షకాదరణతో పాటు కమర్షియల్ సక్సెస్‌ను తెచ్చింది. ప్రస్తుతం వింటేజ్ నరేష్ కామెడీ మిస్సవుతోందని అభిమానులు చెబుతుండడంతో, ఆయన ‘సుడిగాడు 2’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. ‘సుడిగాడు’ ఫార్మాట్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడం అత్యవసరమని నరేష్ భావిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో స్పూఫ్‌లు, మీమ్స్ ముందే ట్రెండింగ్ అవుతున్నాయి. దీనిని మించి హాస్యాన్ని అందించడమే ఈ సీక్వెల్‌కు ఛాలెంజ్. నరేష్, కొత్త సృజనాత్మక పద్ధతులతో ఈ సీక్వెల్‌ను డిజైన్ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘సుడిగాడు 2’కు దర్శకుడిగా ఎవరు ఉంటారన్నది ఇంకా క్లారిటీ లేదు. మొదటి భాగం దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మళ్లీ బాధ్యతలు చేపడతారా లేదా అనేది ఆసక్తికరం.
అయితే కొత్త దర్శకుడిని తీసుకురావడానికి కూడా నరేష్ ఆసక్తి చూపుతున్నారట. ప్రధానంగా కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగల యంగ్ డైరెక్టర్‌ను వెతికే పనిలో ఉన్నారని తెలిసింది. ఈ సీక్వెల్ కథపై నరేష్ పూర్తి దృష్టి పెట్టి, ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా ట్రీట్మెంట్‌తో పాటు, నేటి ట్రెండింగ్ టాపిక్‌లను స్పూఫ్ చేయడం ద్వారా వినోదాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను 2025 చివరి నాటికి పూర్తి చేసి, 2026లో విడుదల చేయాలని నరేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘సుడిగాడు 2’ కేవలం కామెడీ సీక్వెల్ మాత్రమే కాదు, నరేష్ కెరీర్‌లో కొత్త జోష్ తెచ్చే ప్రాజెక్ట్‌గా మారాలని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ సీక్వెల్ విజయం సాధిస్తే, వింటేజ్ నరేష్ మళ్ళీ ఫుల్ ఫాంలోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈసారి ‘సుడిగాడు 2’ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో వేచి చూడాలి.