సినీ ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ బలమైన కారణం ఉంటే తప్ప బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు. మన టాలీవుడ్ లో సీనియర్ హీరో నరేష్ విషయం లో రీసెంట్ గా ఇలా జరిగింది కానీ, తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇటీవల బ్రేకప్ అయిన ఒక జంట ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సంచలనం గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే తమిళ హాట్ హీరోయిన్ లుబ్న అమీర్ తన మాజీ ప్రియుడు మాసీ ఉల్లా పై సంచలన ఆరోపణలు చేసింది. తన మాజీ ప్రియుడు అమీర్ వేధిస్తున్నాడని, పోలీస్ కమీషనర్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక ప్రముఖ డేటింగ్ యాప్ ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాసీ ఉల్లా తో లుబ్న అమీర్ కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరి పరిచయం ప్రేమగా మారింది, చివరికి పెళ్లి చేసుకునే సమయానికి మాసీ ఉల్లా కి అప్పటికే వివాహం అయ్యిందట, అందుకే అతనిని దూరం పెట్టిందట, ఈ విషయాన్ని పోలీస్ ఫిర్యాదు లో ఆమె పేర్కొంది.
ఈ విషయం పై గతం లో కూడా అతని పై కేసు పెట్టానని, ఇప్పుడు బెయిల్ మీద బయటకి వచ్చి తనని హింసిస్తున్నాడని ఆమె పేర్కొంది.అతని తో పాటుగా అతని భార్య నుండి కూడా నాకు వేధింపులు ఎదురు అవుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా అతనితో రిలేషన్ లో ఉన్నప్పుడు అతనితో గడిపిన ప్రైవేట్ ఫోటోలు మరియు వీడియోలను కూడా నాకు చూపిస్తూ ఇది సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కూడా ఆమె ఫిర్యాదు లో పేర్కొంది.
మరో పక్క మాసీ ఉల్లా లుబ్న అమీర్ (Star Actress) పై సంచలన ఆరోపణలు చేసాడు. ఆమె తన ప్రైవేట్ వీడియోలు మరియు ఫొటోలతో వ్యాపారం చేస్తుందని, ఈ విషయం తెలుసుకొనే నేను ఆమెతో గొడవలు పెట్టుకున్నాను అని , అందుకే విడిపోయాము అంటూ చెప్పుకొచ్చాడు. పోలీసులు ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపడుతున్నారు.