Allu Aravind: సొంత కొడుకే అల్లు రామలింగయ్యకు అవకాశాలు లేకుండా చేశారు: రాఘవేంద్రరావు

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబం మెగా కుటుంబం వటవృక్షంలా పెరగడానికి అల్లు రామలింగయ్య బీజం అని చెప్పాలి. ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో దశాబ్దాల కాలం పాటు నటించి సందడి చేసిన అల్లు రామలింగయ్య తన వారసులుగా ఇండస్ట్రీకి అల్లు అరవింద్ ను పరిచయం చేశారు.ఇలా నిర్మాతగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి వచ్చి వారి సామ్రాజ్యాన్ని ఇండస్ట్రీలో విస్తరింప చేశారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ తాజాగా అన్ స్టాఫబుల్ కార్యక్రమానికి వచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ తో పాటు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అలాగే మరో నిర్మాత సురేష్ బాబు వంటి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ రాఘవేంద్ర రావును ప్రశ్నిస్తూ ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య రామానాయుడు గారితో మీకు మంచి అనుబంధం ఉంది. వారి గురించి మీ మాటల్లో చెప్పమని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు అల్లు రామలింగయ్య గురించి మాట్లాడుతూ అల్లు రామలింగయ్య ఎప్పుడు కూడా అల్లు అరవింద్ ను తిట్లు తిడుతూనే ఉండేవారు.

ఒకరోజు అల్లు అరవింద్ నా వద్దకు వచ్చి ఇది మా ఫ్యామిలీ మేటర్. మీరు మా నాన్నకు దయచేసి అవకాశాలు ఇవ్వకండి ఆయనకు వయసు పైబడింది అని చెప్పారు. ఈ విధంగా అల్లు అరవింద్ చెప్పిన ప్రకారమే తనకు అవకాశాలు ఇచ్చే వాళ్ళు కాదు.అయితే అల్లు అరవింద్ వెళ్లిన కొంత సమయానికి అల్లు రామలింగయ్య తన వద్దకు వచ్చి ఏదైనా వేషం ఉందా అని అడిగితే లేదని చెప్పే వాళ్ళం.

దీంతో అల్లు రామలింగయ్య గారు మావాడు నీ దగ్గరకు వచ్చాడా… నాకు తెలుసు వాడు వేషం ఇవ్వద్దని చెప్పి ఉంటాడు అంటూ అరవింద్ గారిని తిట్టేవాళ్ళు అంటూ ఈ సందర్భంగా అప్పటి విషయాలను రాఘవేంద్రరావు ఈ కార్యక్రమం ద్వారా అందరితో పంచుకున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus