Allu Aravind: విశ్వక్ సేన్, దేవి నాగవల్లి మధ్య రాజీ కుదిర్చిన అల్లు అరవింద్!

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఎలాంటి వివాదాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో విశ్వక్ సేన్ నడిరోడ్డుపై ఒక ఫ్రాంక్ వీడియో చేశారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వివాదం సృష్టించింది. ఈ వీడియో కారణంగా కొందరు ఈయనపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయగా టీవీ9 ఏకంగా ఈ విషయంపై డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ లో భాగంగా టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్సేన్ మద్యం మాట మాట పెరిగి పెద్ద ఎత్తున గొడవ పడ్డారు.

ఈ క్రమంలోనే వీరి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున హీరో విశ్వక్ కి కొందరు మద్దతు తెలపగా మరికొందరు టీవీ9 యాంకర్ కు మద్దతు తెలిపారు. అదేవిధంగా ఈ గొడవలో కొందరు రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకుని ఈ విషయంపై స్పందించారు.

తాజాగా వీరిద్దరి గొడవ విషయం పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు.ఈ విధంగా అల్లుఅరవింద్ రంగంలోకి దిగి టీవీ9 యాజమాన్యంతో మాట్లాడి వీరిమధ్య ఏర్పడిన గొడవకు పరిష్కారం చూపించారని తెలుస్తోంది. అయితే టీవీ9 యాజమాన్యానికి అల్లు అరవింద్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సాన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ కలిసి ఆహా నడుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే టీవీ9 యాజమాన్యంతో అల్లు అరవింద్ కు ఉన్న సాహిత్యం వల్ల ఈ గొడవను పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా డిజిటల్ హక్కులను ఆహా కొనుగోలు చేశారని ఈ క్రమంలోనే ఈ విషయంపై అల్లుఅరవింద్ స్పందించి పరిష్కారం చూపించారని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus