AhaTamil: తమిళ ప్రేక్షకులకు కూడా 100 శాతం ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాము: అల్లు అరవింద్

100 శాతం తెలుగు కంటెంట్ తో ఆహా ఓటిటి ప్లాట్ ఫాం ను ప్రారంభించారు టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ గారు. లాక్ డౌన్ కు కొద్ది రోజుల ముందు ప్రారంభమైన ఆహా కి ఇక్కడ మంచి ఆదరణ లభించింది. వెబ్ సిరీస్ లు, మంచి కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలు, నేరుగా విడుదల చేసిన కొత్త సినిమాల తో ఆహా విజయపథంలో దూసుకుపోతుంది. టాక్ షోలు గురించి చెప్పుకోవాలి అంటే ఒక్క బాలీవుడ్ ను మాత్రమే చెప్పుకునే వారు.

Click Here To Watch

కానీ అన్ స్టాపబుల్ వంటి టాక్ షోతో మనమేమి తక్కువ కాదు అని నిరూపించారు అల్లు అరవింద్ గారు. ఇప్పుడు ఆహా ని తమిళంలో కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. శుక్రవారం నాడు చెన్నైలోని ఓ హోటల్ లో ఆహా తమిళ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకి ఆర్‌.బి.చౌదరి, కలైపులి ఎస్‌.థాను, దర్శకుడు కె ఎస్‌ రవికుమార్, శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌ దంపతులు, నటుడు ఎస్‌.జె.సూర్య, ఖుష్భు, కె.భాగ్యరాజ్, పా.రంజిత్, నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు శివ వంటి స్టార్లు హాజరయ్యారు.

తర్వాత అల్లు అరవింద్‌ను నిర్మాత కలైపులి ఎస్‌.థాను సత్కరించారు. తమిళ్ స్టార్ హీరో జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్‌ లు కలిసి ఆహా లోగోను ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఆహా అధినేత అల్లు అరవింద్ మాట్లాడుతూ..’ నేను చెన్నైలోనే పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. ఆ రోజులు నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ ఇప్పుడు తిరిగి రావడం..నాకు పుట్టింటికి వచ్చినంత ఆనందాన్ని కలుగజేస్తుంది.

ఆహా ద్వారా తమిళ ప్రేక్షకులకు కూడా 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ ను అందించడానికి కృషి చేస్తాము ‘ అంటూ ఆయన హామీ ఇచ్చారు.

1

2

3

4







భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus