మా కుటుంబాల మధ్య పొరపొచ్చాలు, గొడవలు లేవు.. కేవలం హీరోల మధ్య ఉండాల్సిన పోటీ మాత్రమే ఉంది అంటూ ఆ మధ్య అల్లు అరవింద్ చెప్పడం మీరు వినే ఉంటారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయా అనే ప్రశ్నకుగాను ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సమాధానం చెప్పారు. అయితే నిజంగా రెండు కుటుంబాల మధ్య ఏమీ లేదా? అంటే ఏదో అవుతోంది అనే చెప్పాలి. చిరంజీవికి పోటీగా సినిమాలు దింపేవాళ్లకు సాయం చేయడం,
చిరంజీవికి సమీప పోటీ హీరోకు వత్తాసు పలకడం లాంటివి చూస్తుంటే అల్లు అరవింద్ లేదు లేదంటూనే లాక్‌లు వేస్తున్నారు అనిపిస్తోంది. ఈ మాట మేం అనడం లేదు. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. శనివారం రాత్రికి ఈ డిస్కషన్ ఇంకా ఎక్కువ అయిపోయింది. దీనికి కారణం సంక్రాంతి రేసులో ‘వరిసు’/ ‘వారసుడు’ సినిమాను నిలబెట్టడానికి ఆయన పాజిటివ్‌గా ఉండటమే. వచ్చే సంక్రాంతి సీజన్‌లో తెలుగు సినిమాలు ఉండటంతో
తమిళం నుండి డబ్బింగ్‌గా వస్తున్న సినిమాలకు ప్రాధాన్యమివ్వొద్దు అని ఇటీవల నిర్మాతల మండలి ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది సాధ్యమవ్వడం కష్టమే అని అల్లు అరవింద్ అన్నారు. బావ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు వేరే ఏ సినిమాలు లేకుండా చూసి మేలు చేయాల్సింది పోయి… పోటీకి తమిళ సినిమా తీసుకొచ్చేయడానికి ఓకే అనడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు అంటున్నారు.
ఇదంతా చూస్తుంటే సంక్రాంతి సీజన్‌లో చిరంజీవికి పోటీగా వేరే సినిమాలు రావాలన్నదే అల్లు అరవింద్ కోరికేమో అనే చతుర్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అల్లు హీరోల సినిమాల విషయంలో ప్రీ రిలీజ్‌లు, సక్సెస్ మీట్లకు చిరంజీవి లేకుండా ఉండరు. చాలా ఏళ్లుగా ఇది చూస్తూనే ఉన్నాం. కానీ ‘పుష్ప’, ‘ఊర్వశివో రాక్షసివో’కి గెస్ట్‌గా వచ్చింది చిరంజీవి కాదనే విషయం మీకు తెలిసిందే. ఇదంతా చూస్తుంటే లాక్‌లు నిజమే అని అనిపిస్తే మా తప్పేం లేదు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!