Allu Aravind: కృష్ణ గొప్పతనం గురించి అల్లు అరవింద్ కామెంట్స్ ఏంటంటే..?

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారి ఇకలేరు అనే మాటను ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆయన వ్యక్తిత్వం, మంచితనం, చేసిన సినిమాలు, ప్రయోగాలు, రికార్డులు, రాజకీయాలు, ఫ్యామిలీ, సినీ రంగానికి చేసిన సేవలు.. ఇలా ఎక్కడ విన్నా, చూసినా కృష్ణ గారి గురించే వార్తలు.. ఆ మహానుభావుణ్ణి కడసారి చూసి నివాళులు అర్పించడానికి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు తరలివస్తున్నారు.. సూపర్ స్టార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు..

అగ్ర నిర్మాత అల్లు అరవింద్, కృష్ణ గారికి నివాళులు అర్పించిన తర్వాత.. తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాలు తియ్యడానికి వచ్చినదగ్గర్నుంచి ఆయణ్ణి అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను.. ఆయన చనిపోయాడన్నప్పుడు ఎంత గొప్పవ్యక్తి చనిపోయాడో అని ఒక విషయం గుర్తొస్తుంది.. తనతో సినిమాలు తీసిన ఇద్దరు, ముగ్గురు నిర్మాతలు సినిమాల రిలీజప్పుడు ఆయనకి బోలెడు డబ్బులివ్వాలి.. అయినా కానీ నిర్మాతలను పిలిచి.. మీరు కష్టాల్లో ఉన్నారంట..

నన్నేమైనా డబ్బులు ఇమ్మంటారా.. అని తన రెమ్యునరేషన్ వదిలేసి.. తిరిగి తన డబ్బులిచ్చి సినిమాలు రిలీజ్ చేయించారు.. హీరోల్లో అంతలా నిర్మాత బాగోగులు కోరుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారు.. అటువంటి వ్యక్తి ఇవాళ మనకి లేరు.. వయసేం పెద్దది కాదు.. దురదృష్టం.. ఇండస్ట్రీ, ఫ్యామిలీ కాకుండా.. ఆయనకి ఇవాళ్టికీ ఇన్ని లక్షల మంది అభిమానులు.. ఆయన జర్నీతో పాటు వస్తూ రావడం అనేది నిజంగా విచిత్రమైన విషయం..

వారి కుటంబానికి నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను’’ అంటూ సూపర్ స్టార్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సినీరంగలోని కళకారులతో పాటు వివిధ శాఖల్లో పనిచేసేవాళ్లు, అభిమానులు కృష్ణ గారికి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. పద్మాలయా స్టూడియో భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus