Allu Arha: వైరల్ అవుతున్న అర్హ క్యూట్ వీడియో!
- September 17, 2023 / 11:51 AM ISTByFilmy Focus
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ ఒకరు. అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక పాన్ ఇండియా హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నారి ఇంత చిన్న వయసులోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె సమంత నటించిన శాకుంతలం సినిమాలో బాలనటిగా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక అల్లు అర్హ ఈ సినిమాలో తన నటన విశ్వరూపాన్ని చూపించారు.

ఇక అర్హకు సంబంధించిన ఎన్నో ముద్దు ముద్దు వీడియోలను క్యూట్ వీడియోలను అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు . ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా అర్హ వినాయకుడిని ఎంతో అందంగా తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
అర్హ తన చిన్ని చిన్ని చేతులతో బొజ్జ గణపయ్యను ఎంతో ముద్దుగా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది అర్హ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా సీక్వెల్స్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ICONSTAR @alluarjun daughter preparing eco-friendly Ganesh ❤️#AlluArha #GaneshChaturthi #GanpatiBappaMorya pic.twitter.com/6dezHkOzXS
— Allu Babloo AADHF (@allubabloo) September 16, 2023

















