Allu Arha: శాకుంతలం డబ్బింగ్ స్టార్ట్ చేసిన అర్హ… సంతోషంలో అల్లు అర్జున్!

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత దేవ మోహన్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. శకుంతల దుష్యంతుల అందమైన ప్రేమ కథ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇలా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, పాటలు విడుదల చేయగా సినిమాపై ఎన్నో అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమాలో శకుంతల కొడుకు భరతుడి పాత్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా అల్లు వారసురాలిగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా అర్హ ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఇలా శకుంతల కుమారుడిగా భరతుడి పాత్రలో నటించిన అర్హ తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా డబ్బింగ్ చెబుతున్నటువంటి

అర్హ ఫోటోని అల్లు స్నేహారెడ్డి అలాగే అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా తమ కూతురు ఇంత చిన్న వయసులోనే ఎంతో ఎదిగిపోయింది అంటూ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఇక అల్లు కుటుంబంలో నాలుగో తరంగా ఇప్పటికే అర్హ ఈ సినిమా ద్వారా వెండితెర పైసందడి చేయడానికి సిద్ధమవడంతో

ఈ సినిమా కోసం సమంత అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం అర్హ డబ్బింగ్ పనులకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus