ఈసారి సంక్రాంతికి గట్టి పోటీనే నెలకొంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్.. ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ల… ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బరిలో తలబడనున్నాయి. ఇక ఈ చిత్రాల ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు… మహేష్, బన్నీ. ఇదిలా ఉంటే.. ఇటీవల మహేష్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. ‘టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ ఓ వింత జోన్లో ఉన్నారు.. ఇప్పుడు అభిమానుల్ని.. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చెయ్యాలి.
కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కాన్సెప్ట్ సినిమాలు చెయ్యాలి.. అంతేకానీ ప్రయోగాలు చేయకూడదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పెడతారు.. వాళ్ళ పై ప్రయోగాలు చెయ్యకూడదు’ అని మహేష్ చెప్పాడు. ఒకవేళ ప్రయోగం చేసే ఉద్దేశం ఉంటే.. తక్కువ బడ్జెట్ లో సినిమాని ఫినిష్ చెయ్యాలి’ అని కూడా చెప్పాడు. మహేష్ చేసిన ఈ కామెంట్స్ గురించి బన్నీ వద్ద ప్రస్తావించగా… ‘అవును.. నిజమే..! ఎన్నో ఏళ్ళ నుండీ కష్టపడిన తర్వాతే స్టార్ హీరోలకు పెద్ద మార్కెట్ వస్తుంది. ఇలా 100 కోట్లు అంతకంటే ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోలు మళ్ళీ 10 కోట్ల బడ్జెట్ సినిమాల్లో నటించడం అనవసరం. వారి మార్కెట్ కు తగ్గట్టుగానే ప్రయోగాలు చెయ్యాలి. చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తే ఆ మార్కెట్ కు ప్రమాదం రాడుతుంది. అంతేకాదు అభిమానులు సైతం విమర్శిస్తారు” అంటూ బన్నీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.