స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారడానికి అతను చేసిన సినిమాలే కారణం. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా రెగ్యులర్ హీరోలకి భిన్నంగా కథల్ని, పాత్రలని ఎంపిక ఎంచుకుని ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు.మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా తాను నిలబడగలనని… పెద్ద స్టార్ గా ఎదగగలనని తన సినిమాలతో చెప్పకనే చెప్పాడు. అయితే ఎంత స్టార్ హీరో అయినా..ఓ సినిమా కథ, కథనాలు జడ్జ్ చేయకుండా ముందడుగు వేయలేడు.
అతను ఎంత రిస్కీ సబ్జెక్టుని ఎంపిక చేసుకున్నా.. అందులో అతని అభిమానులను అలరించే అంశాలు ఉండాలని కోరుకుంటాడు. అయితే మన బన్నీ మాత్రం వీటన్నిటినీ పక్కన పెట్టేసి, ప్లాప్ అవుతాయని తెలిసి కూడా రెండు సినిమాల్లో నటించాడట. స్వయంగా బన్నీనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైములో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. బన్నీకి ‘ఆర్య’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్.. దానికి సీక్వెల్ గా ‘ఆర్య 2’ చేసాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
అయితే దీని చిత్రీకరణ సమయంలోనే బన్నీకి అనిపించిందట.. ‘ఇది ‘ఆర్య’ అంత విజయవంతం కాదు’ అని..! అలాగే క్రిష్ డైరెక్షన్లో చేసిన ‘వేదం’ కూడా హిట్టవ్వదని బన్నీకి ముందే తెలుసట. అయినప్పటికీ ఆ సినిమా చేశాడు. ‘భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే తనకంటూ కొన్ని విభిన్న తరహా చిత్రాలు, పాత్రలు చేశాననే తృప్తి ఉండాలని ఆ సినిమాలు చేసినట్టు’ బన్నీ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?