Allu Arjun: అయాన్ కు సినిమాలపై ఆసక్తి చూపితే తప్పకుండా నటిస్తాడు: అల్లు అర్జున్

పుష్పలో నటనకిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు అల్లు అర్జున్‌. 69 ఏళ్ల పురస్కార చరిత్రలో తెలుగులో ఈ పురస్కారం సాధించిన తొలి నటుడు అల్లు అర్జున్‌. ఇరవయ్యేళ్ల కెరీర్‌లో ఎత్తు పల్లాలెన్నో చూసిన ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇటీవలే జాతీయ పురస్కారం గెలిచిన అల్లు అర్జున్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. నన్నెక్కువమంది ఇష్టపడేది ప్రతి సినిమాకీ నేను ఎదుగుతున్న విధానాన్ని చూసే. ఆ తర్వాతే నా డ్యాన్స్‌, నా ఫైట్లు, నా పాటలు.

తొలి సినిమా నుంచీ నేను ఆలోచించేదంతా మరింత ఉత్తమంగా పనిచేయడం గురించే. ఇది చాలు అని కాకుండా… ఇది కాదు అనుకుంటూనే ప్రయాణం చేస్తా. ఈ పురస్కారం రాకపోయినా సరే, తర్వాత సినిమాకి బెటర్‌మెంట్‌ కోసం ఏమేం చేయాలో అది చేస్తా. పురస్కారం వచ్చినా రాకపోయినా బాధ్యతగా, మరింత ఉత్తమంగా పనిచేయడమే నాకు తెలుసు. ఈసారి జాతీయ పురస్కారం రావడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. నాఅభిమానులే నా బలం, వాళ్లే నా బలగం. ఇంత దూరం వచ్చానంటే వాళ్లే కారణం.

వాళ్ల సంతృప్తి కోసమే ఇంకా పైకి ఎదగాలనే తపన’’. ‘‘నన్ను పెళ్లి చేసుకున్నాక నా భార్య కన్నీళ్లు పెట్టుకుని ఎక్కువ భావోద్వేగానికి గురైంది అంటే జాతీయ పురస్కారం వచ్చిందని తెలిసిన తర్వాతే. తను సినీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. సినిమా చూసి బాగుందో, బాగోలేదో చెబుతుంది తప్ప అంత లోతుగా విశ్లేషించదు. నా సినిమా ఎంత హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా తన జీవితంలో తేడా ఏమీ ఉండదు.

ఏదైనా పురస్కారం వచ్చినట్టు తెలిస్తే ఆ సంతోషాన్ని నాతో పంచుకుంటుందంతే. సినిమాలపై తనేమీ సలహాలు ఇవ్వదు. నేను కూడా తనతో ఆ విషయాల్ని ఎక్కువగా చర్చించను. తనే కాదు, నేను కథల విషయంలో ఎవరిమాటా వినను, నాకు నచ్చిందే చేస్తా. నా నమ్మకం ఆధారంగానే ప్రయాణం చేస్తుంటా. నాకు జాతీయ పురస్కారం రావడంపై మా అబ్బాయి అయాన్‌ అందరికంటే సంతోషంగా ఉన్నాడు. ప్రతిసారీ వచ్చే పురస్కారం కాదు…

తొలిసారి మా నాన్నకే వచ్చిందని తనకి అర్థమైంది. మా అమ్మాయి అర్హకి అంత లోతుగా తెలియదు కానీ, నాన్న ఏదో సాధించాడని మాత్రం తనకి అర్థమైంది. మా అమ్మాయి సినిమాల్లో నటించింది. మా అబ్బాయి కూడా ఆసక్తి చూపితే తప్పకుండా నటిస్తాడు’’. అని (Allu Arjun) అల్లు అర్జున్ అన్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus