Pushpa Movie: సుకుమార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ తన శైలికి భిన్నంగా ఈ సినిమాలో హీరోను ఊరమాస్ గా చూపిస్తున్నారు. ఈ ఏడాదే పుష్ప పార్ట్1 రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బోట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సీన్ ఉంటుందని ఆ సీన్ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని బోట్ ఫైట్ గతంలో చూసిన బోట్ ఫైట్లతో పోలిస్తే భిన్నంగా, రిచ్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. మరోవైపు అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ కు విలన్ గా ఫ‌హ‌ద్ ఫాజిల్ నటిస్తుండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు సుకుమార్ శిష్యుడు, ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా పుష్ప పార్ట్ 1 పది కేజీఎఫ్ లకు సమానమని చెప్పారు.

ప్రశాంత్ నీల్ టేకింగ్, మాస్ ఎలివేషన్స్ కేజీఎఫ్ ఛాప్టర్ 1కు హైలెట్ గా నిలవగా సుకుమార్ బన్నీని ఏ విధంగా చూపించారో చూడాల్సి ఉంది. ఇప్పటికే పుష్పపై అంచనాలు పెరగగా బుచ్చిబాబు చెప్పిన మాటలు ఆ అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా ఈ సినిమాలో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus