Allu Arjun Cars: ఆ రంగు కార్లు అంటే బన్నీకి ఇష్టమా?

స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ తో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. పుష్ప సక్సెస్ బన్నీకి బాలీవుడ్ లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. పుష్ప రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు బన్నీ కోరుకున్న పాన్ ఇండియా హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. బన్నీ త్వరలో పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Click Here To Watch

పాన్ ఇండియా హీరో బన్నీ తన లైఫ్ స్టైల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. స్టైలిష్ గా కనిపించే ఈ ఐకాన్ స్టార్ నలుపు రంగును ఎక్కువగా ఇష్టపడతారు. బన్నీ దగ్గర అన్ని సౌకర్యాలతో ఉన్న వ్యానిటీ వ్యాన్ ఉంది. ఫాల్కన్ అనే పేరుతో ఉండే ఈ వ్యాన్ పై బన్నీ స్టైలిష్ గా ఏఏ అనే అక్షరాలను రాయించుకున్నారు. ఈ వ్యానిటీ వ్యాన్ ఖరీదు ఏకంగా 7 కోట్ల రూపాయలు అని సమాచారం.

బన్నీకి జూబ్లీహిల్స్ లో ఖరీదైన భవంతి ఉండగా ఈ భవంతి ఖరీదు 100 కోట్ల రూపాయలు అని సమాచారం. బన్నీ గ్యారేజ్ లో ఎక్కువ సంఖ్యలో లగ్జరీ కార్లు ఉండగా ఈ కార్లలో రేంజ్ రోవర్ వోగ్ కారు అత్యంత ఖరీదైనది. బన్నీ ఈ కారుకు బీస్ట్ అని పేరు పెట్టుకోగా ఈ కారు ఖరీదు 2 కోట్ల 26 లక్షల రూపాయలు అని సమాచారం. బన్నీ లాంగ్ డ్రైవ్ లకు వెళ్లే సమయంలో హమ్మర్ హెచ్2 కారును వినియోగిస్తారు.

ఈ కారు ఖరీదు 75 లక్షల రూపాయలు అని సమాచారం. ఈ కార్లతో పాటు బన్నీ దగ్గర మెర్సిడెస్ 200 సీడీఐ కారు కూడా ఉంది. ఈ కారుకు సన్ రూఫ్ టాప్ సౌకర్యం ఉందని తెలుస్తోంది. ఈ కారులో బన్నీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిసార్లు షికారుకు వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

1

2

3

4

5

6

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus